సొంతగడ్డపై కోల్ కతా నైట్ రైడర్స్ సమిష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నషటానికి 204 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దుల్ ఠాకూర్ ( 29బంతుల్లో 68: 9ఫోర్లు, 3సిక్సులు) మెరుపు ఇన్సింగ్స్ తో అదరగొట్టాడు.. గుర్భాజ్ ( 44 బంతుల్లో 57: 6 ఫోర్లు, 3 సిక్సులు), రింకూ సింగ్ ( 33 బంతుల్లో 46: 2 ఫోర్లు, 3 సిక్సులు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్ కతా స్కోర్ 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read : Bandi Sanjay Bail Live: బండి సంజయ్ కి బెయిల్.. కండిషన్స్ అప్లై
అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి ( 4/15), సునీల్ నరైన్ ( 2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ ( 3/30 ) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్సింగ్స్ నాలుగో ఓవర్ లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్ దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్భాజ్ జోరు కొనసాగించడంతో కోల్ కతా పవర్ ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్ తో జత కలిసి గుర్భాజ్ కోల్ కతా ఇన్సింగ్స్ ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్ కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్భాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్ కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయారు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుపడ్డాడు.
Also Read : Sri Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
20బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్థుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్థుల్ ను సిరాజ్ అవుట్ చేయగా.. చివరి రెండు బంతుల్లో ఉమేష్ ఆరు పరుగులు స్కోర్ చేయడంతో కోల్ కతా స్కోర్ 200 రన్స్ మార్క్ దాటింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ( 18బంతుల్లో 21: 3 ఫోర్లు ), డు ప్లెసిస్ ( 12బంతుల్లో 23: 2 ఫోర్లు, 2 సిక్సులు ) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్ లో కోహ్లీ, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్సింగ్ తడపడింది. హిట్టర్లు బ్రేస్ వెల్, మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తిక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటి ఖాయమైంది. కోల్ కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్.. 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్సింగ్స్ లో సిరాజ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.