Site icon NTV Telugu

New Captain Sanju Samson: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఏ జట్టుకో తెలిస్తే షాకే!

Sanju

Sanju

New Captain Sanju Samson: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2025-26 కోసం కేర‌ళ క్రికెట్ అసోసియేష‌న్ తమ జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకోవాలని సంజూ చూస్తున్నాడు. అయితే, ఈ టోర్నీ మొత్తానికి సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు.. కేవలం గ్రూపు స్టేజిలో మాత్రమే ఆడనున్నాడు. కాగా, నవంబ‌ర్ 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ దేశ‌వాళీ టోర్నమెంట్ లీగ్ గ్రూపు ద‌శ మ్యాచ్‌లు డిసెంబర్ 8వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్ స్టార్ట్ కానుంది.

Read Also: Sai Pallavi: నా పేరు పెట్టింది ఆయనే.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే, ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ ఆడనున్నాడు. అతు గైర్హాజరీలో కేర‌ళ జ‌ట్టు కెప్టెన్‌గా మహ్మద్ ఇమ్రాన్ కెప్టెన్ గా వ్యవహ‌రించనున్నాడు. నవంబ‌ర్ 26న కేర‌ళ త‌మ తొలి మ్యాచ్‌లో ల‌క్నోతో తలపడనుంది. కేర‌ళ జ‌ట్టులో రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్ లాంటి విధ్వంస‌క‌ర ప్లేయర్స్ ఉన్నారు. ఇక, ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌-2026కి ముందు సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మినీ వేలానికి ముందు రాజస్తాన్ నుంచి సంజూను సీఎస్‌కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా జడేజా, సామ్ కుర్రాన్‌లను వదిలి పెట్టుకుంది.

Read Also: Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కేర‌ళ జ‌ట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్‌), రోహన్ ఎస్‌. కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్, అహమ్మద్ ఇమ్రాన్ (వైస్ కెప్టెన్‌), విష్ణు వినోద్, నిధీష్ ఎమ్‌.డి., ఆసిఫ్ కె.ఎమ్., అఖిల్ స్కారియా, బిజు నారాయణన్ ఎన్‌, అంకిత్ శర్మ, కృష్ణ దేవన్ ఆర్‌.జె., అబ్దుల్ బాజిత్ పి.ఎ., షరఫుద్దీన్ ఎన్‌.ఎమ్., సిబిన్ వి., ప్రసాద్, సల్మాన్ నిజార్.

Exit mobile version