సన్ రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ మరోసారి హైలైట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ వాలిపోయే కావ్య పాప జట్టును ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ కావ్య మారన్ హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్సింగ్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ ను తొందరగానే కోల్పోయింది. ఇన్సింగ్స్ ఐదో ఓవర లో ఇంపాక్ట్ ప్లేయర్ ఫరుకీ వేసిన బంతిని ఆడే క్రమంలో లక్నో డేంజర్ బ్యాటర్ కైల్ మేయర్స్.. మాయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కైల్ మేయర్స్ వికెట్ పడగాన్నే కావ్వ మారన్ సంతోషం మాములుగా లేదు. కుర్చీలో నుంచి పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
Sunrisers Owner Kavya Maran Reaction for Kyle Myers Wicket. 😝 pic.twitter.com/IoPCc8kTYr
— KaRuN (@KarunakarkarunN) April 7, 2023
Also Read : Traffic diversion: నగరంలో ట్రాఫిక్ డైవర్సన్.. గంట ముందే బయలు దేరండి
అయితే ఈ ఆనందం ఆమెకు ఎక్కువ సేపు నిలవలేదు. లక్ష్యం చిన్నది కావడంతో లక్నో నిలకడగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. పాపం కావ్య మారన్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్ లో వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. అయితే ఒక్క వికెట్ పడగానే ఇంత వైల్డ్ సెలబ్రేషన్స్ చేసిందంటే మ్యాచ్ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయిన ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనకు బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. కేఎల్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..