NTV Telugu Site icon

జడేజా బ్యాటర్ గా మెరుగవుతున్నాడు.. బౌలర్ గా లేదు : కపిల్ దేవ్

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తాకాడు ఇష్టమైన ఆల్-రౌండర్‌లుగా పేర్కొన్నాడు. నేను ఈ రోజుల్లో క్రికెట్ చూడటానికి మరియు ఆటను ఆస్వాదించడానికి గ్రౌండ్ కు వెళుతున్నాను. అయితే ఆటను నేను మీ దృష్టికోణం నుండి చూడటం లేదు. ఆటను ఆస్వాదించడమే నా పని. అయితే జడేజా బ్యాటర్‌గా చాలా మెరుగుపడ్డాడని, అయితే బంతితో అతని ఫామ్ తగ్గిందని చెప్పాడు. అతను ఆట ప్రారంభించినప్పుడు చాలా మంచి బౌలర్, కానీ ఇప్పుడు అతను చాలా మంచి బ్యాటర్. భారత్‌ కు అతనికి అవసరమైన ప్రతిసారీ, అతను పరుగులు సాధిస్తున్నాడు. కానీ అతను బౌలర్‌గా రాణించలేడు” అని కపిల్ చెప్పాడు. అయితే జడేజా గత మూడేళ్లలో 18 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జడేజా 800 పరుగులు చేశాడు.అలాగే కేవలం 42 వికెట్లు మాత్రమే తీసాడు.