NTV Telugu Site icon

Kapil Dev: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?..కపిల్ దేవ్ దిమ్మతిరిగే కౌంటర్

Ka[il

Ka[il

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే గత మూడేళ్లలో ఒక్క సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ గతేడాది ఆసియా కప్‌లో సెంచరీ తర్వాత మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన విరాట్.. తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. అలాగే వన్డేల్లో సచిన్ పేరుమీదున్న రికార్డు సెంచరీల వైపు వేగంగా దూసుకెళ్తున్నాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. విరాట్ ప్రస్తుతం 46 శతకాలతో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి సచిన్, కోహ్లీలలో ఎవరు గొప్ప అన్న చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై ఎవరి అభిప్రాయం వారిది. తాజాగా కపిల్ దేవ్ కూడా దీనిపై స్పందించాడు.

Viral Video: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో తాతయ్య రచ్చ.. మంచి రొమాంటిక్‌ డైరెక్టర్‌ అయ్యేవాడేమో..!

“జనరేషన్ మారినా కొద్దీ ఒకరి కంటే మెరుగైన ప్లేయర్ మరొకరు వస్తూనే ఉంటారు. అందువల్ల వారి మధ్య పోలిక పెట్టడం అనవసరం. క్రికెట్ అనేది 11 మంది ప్లేయర్స్‌తో కూడిన టీమ్. నాకు నా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ ప్రతి తరం మరింత మెరుగైన ఆటగాడిని అందిస్తుంది. మా టైమ్ లో సునీల్ గవాస్కర్ అత్యుత్తమ బ్యాటర్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్ లాంటి వాళ్లు వచ్చారు. ఈ తరంలో రోహిత్, విరాట్ ఉన్నారు. వచ్చే తరంలో మరింత మెరుగైన ప్లేయర్స్ వస్తారు. మనం మరింత మెరుగైన క్రికెటర్‌ను, మరింత మెరుగ్గా ఆడటం చూస్తాం” అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ వెల్లడించాడు.

Mahakaleswar Temple: రిషబ్ పంత్ కోసం.. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో క్రికెటర్ల పూజలు

సచిన్‌తో పోలిక విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. వన్డే ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్ లోకి రావడం మాత్రం ఫ్యాన్స్‌ను ఆనందానికి గురి చేస్తోంది. గత ఆరు వన్డేల్లో విరాట్ మూడు సెంచరీలు చేయడం విశేషం. ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.