భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముకకు శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత నుండి పాండ్యా ఫిట్నెస్ లో సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుండి పాండ్యా అనుకున్న విధంగా బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ చేయలేకపోతున్నారు. అయినా ఇప్పటి వరకు అతనికి లభించిన మద్దతు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ స్టార్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని పిలవాలా అని ప్రశ్నించాడు. అయితే పాండ్యా ఆల్ రౌండర్‌గా పరిగణించబడాలంటే.. అతను రెండు పనులు చేయాలి. మొదటిది అతను గాయం నుండి బయటపడ్డాడు.. కాబట్టి అతన్ని బౌలింగ్ చేయనివ్వండి. అలాగే అతను బౌలింగ్ చేయడం కోసం ఇంకా చాలా మ్యాచ్ లు ఆడాలి అని కపిల్ చెప్పాడు. ఇక పాండ్యా జట్టుకు చాలా ముఖ్యమైన బ్యాటర్ కూడా అని చెప్పాడు ఈ మాజీ ఆల్ రౌండర్.
హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని పిలవవచ్చా..?
