NTV Telugu Site icon

Kagiso Rabada: చరిత్ర సృష్టించిన రబాడ.. మలింగ రికార్డ్ బద్దలు

Kagiso Rabada Record

Kagiso Rabada Record

Kagiso Rabada Creates History In IPL: ఐపీఎల్‌లో సౌత్ ఆఫ్రికన్ పేసర్ కగిసో రబాడ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున గురువారం తన తొలి మ్యాచ్ ఆడిన రబాడ.. వచ్చి రావడంతోనే అరుదైన రికార్డ్‌ని సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా అతడు ఐపీఎల్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా, తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ అగ్రస్థానంలో నిలిచాడు.

Job Scam Alert: రూ. 2,999 చెల్లిస్తే రూ.15 వేల జాబ్‌.. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం!

ఇంతకుముందు తొలిస్థానంలో శ్రీలంకన్ బౌలర్ లసిత్ మలింగ ఉండేవాడు. అతడు వంద వికెట్లు సాధించేందుకు 1622 బంతులు తీసుకున్నాడు. కానీ.. రబాడ 1438 బంతుల్లోనే వంద వికెట్లు తీసి, మలింగ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు. అగ్రస్థానాన్ని తాను కైవసం చేసుకుని, మలింగను రెండో స్థానాన్ని దిగజార్చాడు. ఈ జాబితాలో మలింగ తర్వాత డ్వేన్‌ బ్రావో (1619 బంతులు) మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్‌ (1647 బంతులు) ఉన్నాడు. కేవలం బంతుల పరంగానే కాదండోయ్.. మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలిస్థానంలో నిలిచాడు. 64 మ్యాచ్‌ల్లో రబాడ వంద వికెట్లు సాధించగా.. మలింగ 70 మ్యాచ్‌లు, భువనేశ్వర్‌ – హర్షల్‌ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్‌ ఖాన్‌ – అమిత్‌ మిశ్రా – ఆశిష్‌ నెహ్రాలు 83 మ్యాచ్లు, యజ్వేంద్ర చహల్‌ 84 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నారు.

Prithvi Shaw: పృథ్వీ షాకు షాక్.. ఆ కేసులో హైకోర్టు నోటీసులు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. 19.5 బంతుల్లో ఆరు వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేధించింది. శుభ్మన్ గిల్ (67) అర్థశతకంతో రాణించి.. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మలుపు తీసుకున్నా.. తెవాతియా స్కోర్ బాదడంతో గుజరాత్ గెలుపొందింది.