Site icon NTV Telugu

రాజస్థాన్‌ రాయల్స్‌ ఊహించని షాక్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐపీఎల్‌ మిగతా సీజన్‌కు స్టార్ ప్లేయర్ జోస్‌ బట్లర్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. బట్లర్ భార్య లూయిస్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుందని, అందుకే మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది రాజస్తాన్ రాయల్స్. ఇది ఇలా ఉండగా.. అటు ఐపీఎల్ సెకండ్ సెషన్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రాక్టీస్‌ మొదలెట్టింది. సీఎస్కే ప్లేయర్‌లో కెఫ్టెన్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్ తో పాటు మరికొంతమంది ఈనెల 13న యూఏఈకి చేరుకున్నారు. వారం రోజుల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత ధోనీసేన ప్రాక్టీస్‌ను ఆరంభించిది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Exit mobile version