NTV Telugu Site icon

Joe Root : కెప్టెన్సీ వదిలి రూటు మార్చిన “రూట్”.. ఎట్టకేలకు సచిన్ రికార్డు బ్రేక్

Root

Root

ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచు  లో ఇంగ్లండ్ అదరగొట్టింది. మూడు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్ట్ మ్యాచ్ లో రూట్  సెంచరీతో(115*) కదంతొక్కాడు. రూట్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, రూట్ సమయోచితంగా ఆడి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రూట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

టెస్టుల్లో తక్కువ వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్  రికార్డ్ ను సమం చేశాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఇద్దరు(కుక్, రూట్) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అలాగే, సచిన్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. సచిన్ 10 వేల పరుగుల మార్క్ ను 31 ఏళ్ల 326 రోజుల వయసులో అందుకున్నాడు.

అయితే 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి కుక్ కు 229 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, రూట్ 218 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వరల్డ్ వైడ్ గా చూస్తే 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 14వ వాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 10వ వాడు.

అయితే, టెస్ట్ కెరీర్ లో జో రూట్ కి ఇది 26వ సెంచరీ. రూట్.. 170 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 12 బౌండరీలు ఉన్నాయి. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 118 టెస్టులు ఆడిన రూట్.. 10వేల 015 పరుగులు చేశాడు.న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్సింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

టెస్ట్ క్రికెట్ లో 10వేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే..

1. సచిన్ టెండూల్కర్ (భారత్) – 15,921

2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,378

3. జాక్వస్ కలిస్ (సౌతాఫ్రికా) – 13,289

4. రాహుల్ ద్రావిడ్ (భారత్) – 13,288

5. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) – 12,472

6. కుమార సంగక్కర (శ్రీలంక) – 12,400

7. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 11,953

8. శివన్నారయణ చంద్రపాల్ (వెస్టిండీస్) – 11,867

9. మహేల జయవర్దనే (శ్రీలంక) – 11,814

10. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 11,174

11. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 10,927

12. సునీల్ గావస్కర్ (భారత్) – 10,122

13.యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) – 10,099

14. జో రూట్ (ఇంగ్లండ్) – 10,015*