Site icon NTV Telugu

Jasprit Bumrah-Ishan Kishan: జస్ప్రీత్ బుమ్రా యార్కర్.. ఇషాన్ కిషన్‌కు భారీ గాయం, డౌటే ఇగ (వీడియో)!

Jasprit Bumrah Ishan Kishan

Jasprit Bumrah Ishan Kishan

Jasprit Bumrah Yorker Injures Ishan Kishan: టీ20 ప్రపంచకప్‌ 2026 లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ నేరుగా అతడి ఎడమ కాలి బొటనవేలికి తాకింది. దాంతో కిషన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేయగా కాస్త కుదుటపడ్డాడు. నెట్‌ సెషన్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన కిషన్‌.. కాసేపటికి మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇషాన్ కిషన్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతని ఫిట్‌నెస్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. నమీబియా చిన్న జట్టే కాబట్టి.. అవసరమైతే అతడికి విశ్రాంతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. అభిమానులు కిషన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో జట్టు ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎంతటి రిస్క్ ఉంటుందో మరోసారి స్పష్టమైంది.

Also Read: T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!

టీమిండియాను గాయాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి కోలుకుంటున్నాడు. నమీబియా మ్యాచ్‌లో అభిషేక్‌ ఆడడం లేదు. పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ 2026 మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. గాయంతో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అమెరికాతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. తీవ్ర జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. తిలక్ వర్మ కూడా గాయం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version