Site icon NTV Telugu

T20 World Cup 2022: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. వరల్డ్‌ కప్‌కు కీలక బౌలర్‌ దూరం

Jasprit Bumrah

Jasprit Bumrah

టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు టీం ఇండియాకు మరో గట్టి దెబ్బే తగలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. మోకాలి సర్జరీ చేయించుకొని రెస్ట్‌ లో ఉన్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్‌ ఠాకూర్‌ కూడా గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు ముందే జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వెన్నునొప్పితో బూమ్రా కూడా తప్పుకోవడంతో… వరుస గాయాలు టీం ఇండియాను కలవరపెడుతున్నాయి. గత ప్రపంచకప్‌లో పేవలమైన ప్రదర్శనతో… గ్రూప్ స్టేజ్‌ లోనే భారత్ ఇంటిముఖం పట్టింది. ఓటమికి బాధ్యత వహిస్తూ… విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదిలేశాడు. రోహిత్‌ పూర్తిస్థాయి పగ్గాలు చేపట్టడంతో… ఈసారి వలర్డ్‌ కప్‌ లో టీం ఇండియాపై భారీగానే ఆశలున్నాయి. కానీ.. వరుస గాయాలతో ఒక్కో ప్లేయర్‌ దూరమవుతుండటం టెన్షన్‌ పెడుతోంది.

Read Also: Munugode Bypoll: మునుగోడులో ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష.. గొడ దూకే నేతలకు డిమాండ్..!

డెత్‌ ఓవర్లలో టీం ఇండియా ఫోబియాను బూమ్రా తొలగిస్తాడని ఆశిస్తే.. జట్టులోనే లేకుండాపోయాడు. చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడంతో ఆసియా కప్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకొంది. హర్షల్‌, బుమ్రా రాకతో డెత్‌ ఓవర్లలో టీం ఇండియా బలంగా మారుతుందని భావించారు కానీ… సీన్‌ రివర్స్‌ అయ్యింది. జడేజా స్థానంలో అక్సర్‌ పటేల్ ను రిప్లేస్‌ చేసినా… అక్సర్‌ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా… అంతంతమాత్రంగానే ఆడాడు. మరోవైపు బూమ్రాకి రిప్లేస్‌ ఎవరు అనే చర్చ టీం ఇండియాను టెన్షన్‌ పెడుతోంది. టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేసిన స్టాండ్‌ బై ప్లేయర్ల జాబితాలో ఉన్న మహమ్మద్‌ షమీ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

బుమ్రా స్థానంలో… అవకాశం కోసం మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌ కూడా రేసులో ఉన్నాడు. అయితే… ఆసీస్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలం కాబట్టి పేసర్‌ అయితేనే ఉత్తమం అనే ఆలోచనలో ఉంది రోహిత్‌ సేన. అందుకే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ షమీ వైపు మొగ్గుచూపే ఛాన్స్‌ ఉంది. అప్పుడు స్టాండ్‌బై ఆటగాడిగా ఒకరిని భారత్‌ ఎంపిక చేయాలి కాబట్టి. మహమ్మద్ సిరాజ్‌ లేదా ఉమ్రాన్‌ ఖాన్‌.. అవేశ్‌ ఖాన్‌.. ఉమేష్‌ యాదవ్‌ లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. గాయంతో దూరమైన బూమ్రాను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేవలం 2 టీ20లు మాత్రమే ఆడిన బూమ్రా.. మళ్లీ గాయపడ్డాడంటే.. ఫిట్‌నెస్‌ ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందని పోస్ట్‌ చేస్తున్నారు. బూమ్రా.. కింగ్‌ ఆఫ్ ఇంజ్యూరీ అని.. పట్టుమని వరుసగా మూడు టీ20లు ఆడలేడు.. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ముంబై కోసం 14 మ్యాచ్‌లు ఆడేస్తాడని.. రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు.

Exit mobile version