NTV Telugu Site icon

Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు

Bhumra

Bhumra

Jasprit Bumrah: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట మధ్యలోనే స్టాండిన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. 31వ ఓవర్ ముగిసిన తర్వాత గాయం వల్ల అకస్మాత్తుగా గ్రౌండ్ ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వైద్య బృందంతో కలిసి స్కానింగ్ కోసం అతడు హస్పటల్ కి వెళ్లాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అప్పగించారు. దీంతో బుమ్రా మైదానం వీడటం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. దీంతో బుమ్రాకు ఏం కావొద్దంటూ సోషల్ మీడియాలో టీమిండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

కాగా, టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలిపోయింది. కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ తరఫున ఇన్సింగ్స్ లో బ్యూ వెబ్‌స్టర్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ రెడ్డి తలో 2 వికెట్లు తీశారు.

Show comments