Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
- ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఇషాన్ కిషన్
- 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్
- సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యం అని చెప్పుకొచ్చాడు.
అవార్డు సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘నిజాయితీగా చెప్పాలంటే ఆరంభంలో బంతి కాస్త స్వింగ్ అయింది. అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా సహాయపడింది. అభిషేక్ దూకుడు చూస్తే జట్టుకు ఏ మోమెంటం కావాలో స్పష్టంగా అర్థమవుతుంది. బంతిని జాగ్రత్తగా చూసి ఆడడమే నా పని. అదే ఈ రోజు నాకు కలిసొచ్చింది. జట్టంతా ఇప్పుడు ఒకే మైండ్‌సెట్‌లో ఉంది. మైలురాయి దగ్గర ఉన్నామని సింగిల్స్ తీసుకుంటూ ఆడితే.. తర్వాత పెద్ద షాట్లు కొట్టే అవకాశం కోల్పోయామనే భావన కలుగుతుంది. కాబట్టి బంతి కొట్టడానికి అనుకూలంగా ఉంటే.. ఎలాంటి భయం లేకుండా షాట్స్ ఆడాల్సిందే. జట్టు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం తప్ప.. వ్యక్తిగత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను’ అని చెప్పాడు.
Also Read
- AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
‘ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు. నేను ఇంకా పూర్తి స్థాయిలో ఆటలేదని భావిస్తున్నా. నేను బాగా ఆడాను, అవార్డు కూడా వచ్చింది కానీ.. నా దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్ 2026పైనే ఉంది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ మెగా టోర్నీలో కూడా జట్టుకు ఉపయోగపడటమే ఇన్నింగ్స్ ఆడాలి. అదే నా అసలైన టార్గెట్. ప్రస్తుతం భారత జట్టు బాగుంది. అందురూ బాగా ఆడుతున్నారు. తప్పకుండా టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని ఇషాన్ కిషన్ ధీమా వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ విఫలమైన నేపథ్యంలో కిషన్ ఓపెనింగ్ చేయడం ఖాయం అయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!