Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని.. అయితే తన టికెట్‌ను విస్తారా సిబ్బంది డౌన్‌గ్రేడ్ (బుక్ చేసుకున్న క్లాస్ కాకుండా వేరే సీటు కేటాయించడం) చేశారని మండిపడ్డాడు . కౌంటర్ వద్ద అరగంట వెయిట్ చేయించారని.. ఇదేంటని అడిగితే దురుసుగా ప్రవర్తించారని ఇర్ఫాన్ తెలిపాడు. దీంతో తనతో ఉన్న 5 ఏళ్ల చిన్నారి, 8 నెలల పసికందు ఎంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నాడు.
Read Also: Tallest Buildings: ప్రపంచంలో అత్యధిక ఎత్తైన భవనాలు ఉన్న నగరం ఇదే
అసలు తన టిక్కెట్‌ను డౌన్‌గ్రేడ్ ఎందుకు చేశారో విస్తారా సిబ్బంది వివరణ ఇవ్వలేదని. .ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ డిమాండ్ చేశాడు. తనతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైందన్నాడు. ఈ విధంగా టికెట్లు అమ్ముకోవడం ఎందుకో అర్థంకావడం లేదని పఠాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ విధానాన్ని విస్తారా మేనేజ్ మెంట్ ఎలా అనుమతిస్తోందని ప్రశ్నించాడు. వివరణ అడిగినందుకు విస్తారా ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ ఎంతో దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని సూచించాడు. తనకు ఎదురైన అనుభవం మరెవ్వరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్లు పఠాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కాగా ఇర్ఫాన్ పఠాన్ వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడాల్సి ఉంది.