Ambati Rayudu question Tom Moody Over His Selection in SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు తేజం, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ముంబై, చెన్నై జట్లు టైటిల్స్ గెలిచిన జట్టులో రాయుడు భాగం అయ్యాడు. 38 ఏళ్ల రాయుడు ఇంకా 2-3 ఏళ్లు ఆడే అవకాశం ఉన్నా.. రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2023 అనంతరం అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి వెళుదామనుకున్నా అది కుదరక.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ, రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ఐపీఎల్ 2024లో భాగంగా టామ్ మూడీ, అంబటి రాయుడులు ఓ మ్యాచ్‌కు కామెంట్రీ చెప్పారు. ఈ సందర్భంగా మూడీని రాయుడు ఓ ప్రశ్న అడిగాడు. ‘లోకల్ ఆటగాడిగా నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూడడాన్ని ఇష్టపడుతా. సన్‌రైజర్స్ ప్రత్యర్థిగా ఆడటాన్ని కూడా ఆస్వాదించా. ఓ తెలుగు ప్లేయర్‌గా హైదరాబాద్ జట్టుకు కూడా ఆడాలనుకున్నా. మీరు కోచ్‌గా ఉండి కూడా నన్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు’ టామ్ మూడీని రాయుడు ప్రశ్నించాడు.
Also Read: Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!
అంబటి రాయుడు ప్రశ్నకు టామ్ మూడీ స్పందిస్తూ… ‘నిన్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకోవడానికి మేం చాలా ప్రయత్నించాం. ఎందుకంటే నువ్ కూడా బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా కట్ షాట్స్ అద్భుతంగా ఆడుతావు. కానీ హోమ్ స్టేట్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు నీకు కాలం కలిసి రాలేదు. హైదరాబాద్‌లో నీకున్న ఫాలోయింగ్‌కు ఒక్కసారైనా ఆరెంజ్ జెర్సీలో ఆడుంటే బాగుండేది’ అని తెలిపాడు. రాయుడు 204 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4348 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
