Site icon NTV Telugu

Hardik Pandya: హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్‌తో ఆశ్చర్యపోయా: సెహ్వాగ్

Virender Sehwag New

Virender Sehwag New

Virender Sehwag Fires on Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇప్పుడు లేవు. జట్టు పేలవమైన ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు మాజీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వ నైపుణ్యాలు, ఫీల్డ్‌లో నిర్ణయాత్మక సామర్ధ్యాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా హార్దిక్ గురించి స్పందించాడు.

కోల్‌కతాతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్‌తో వీరేంద్ర సెహ్వాగ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ… ‘ఆండ్రి రస్సెల్‌ను కోల్‌కతా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. అతడు కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌లు లోయర్‌ ఆర్డర్‌లో వచ్చారు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఏం సాధిస్తారు?. అప్పటికి ఎన్ని బంతులు మిగిలిఉంటాయి?. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొస్తే మరిన్ని బంతులను ఆడొచ్చు. మ్యాచ్‌ను ఇంకాస్త వేగంగా ముగించే అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.

Also Read: iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

‘కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోముంబై ఛేజింగ్‌కు దిగింది. టిమ్‌ డేవిడ్‌ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. హార్దిక్ పాండ్యా అతడి కంటే ముందు మాత్రమే క్రీజ్‌లోకి వచ్చాడు. అంటే త్వరగా బ్యాటింగ్‌కు వస్తే ఔటైపోతామని భావిస్తున్నారా?. గుజరాత్‌కు ఆడేటప్పుడు హార్దిక్ ఎక్కువగా నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఇప్పుడు మాత్రం పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను ముందుకు పంపి.. అతడు లోయర్‌లో వస్తున్నాడు. ముంబై మేనేజ్‌మెంట్‌ ఇలాంటి చర్యలపై దృష్టిసారించాలి’ అని వీరూ సూచించాడు.

Exit mobile version