Sunrisers Hyderabad Won The Match By 4 Wickets Against Rajasthan Royals: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఆర్ఆర్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేధించింది. చివర్లో సందీప్ శర్మ వేసిన నో బాల్ పుణ్యమా అని.. చేజారిన ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ సొంతం అయ్యింది. ఒకవేళ సందీప్ నో బాల్ వేయకపోయి ఉంటే, రాజస్థాన్ నాలుగు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలుపొందేది. కానీ.. అతడు నో బాల్ వేయడంతో ఎస్ఆర్‌హెచ్ మరో బంతితో పాటు ఫ్రీ హిట్ కలిసొచ్చింది. క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. సిక్స్ కొట్టడంతో, ఎస్ఆర్‌హెచ్ విజయఢంకా మోగించింది. ఆ నో బాల్ ఆర్ఆర్ పాలిక శాపం కాగా, ఎస్ఆర్‌హెచ్‌కి వరంగా మారింది.
Hanuman Chalisa : కాంగ్రెస్ మేనిఫెస్టోకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66) విలయతాండవం చేయడంతో.. యశస్వీ జైస్వాల్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. రాజస్థాన్ రాయల్స్ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి గెలుపొందింది. తొలుత ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో కుదురుకున్న తర్వాత షాట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇంతలో అన్మోల్ ప్రీత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతనితో పాటు వచ్చిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (55) అర్థశతకం చేశాడు. రాహుల్ త్రిపాఠి కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లోనే అతడు మూడు సిక్స్‌లు, రెండు ఫోర్ల సహకారంతో 47 పరుగులు చేశాడు.
Dhanush: అనుష్క సినిమాలో ధనుష్.. ఇది అస్సలు ఊహించలేదే
ఒకానొక దశలో ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ చేజారిందని అనుకుంటున్న తరుణంలో.. క్లాసెన్ (26), ఫిలిప్స్ (25) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లతో మళ్లీ ఆశలు చిగురించాయి. 2 ఓవర్లకు 41 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. ఫిలిప్స్ వరుసగా మూడు సిక్సులు, ఒక ఫోర్ బాది.. లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లాడు. ఇక ఫైనల్ ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. అబ్దుల్ సమద్ సమర్థవంతంగా కంప్లీట్ చేశాడు. నిజానికి.. చివరి బంతికి 5 పరుగులున్నప్పుడు, అబ్దుల్ సమద్ స్ట్రెయిట్‌గా ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. అప్పుడు ఆర్ఆర్ గెలుపొందిందని అనుకున్నారు. కానీ, అది నో బాల్‌గా తేలడంతో, అబ్దుల్ సమద్ నాటౌట్‌గా నిలిచాడు. మరో బంతి కలిసి రావడంతో.. అతడు సిక్స్ కొట్టి, జట్టుని గెలిపించాడు. నిజంగా.. ఇదో చమత్కారమేనని చెప్పుకోవాలి.