NTV Telugu Site icon

Pat Cummins: సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన విదేశీ కెప్టెన్సీ.. మూడో ఆసీస్ ప్లేయర్‌గా కమిన్స్!

Srh

Srh

Foreign Players Captaincy Luck To Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళితే.. అన్నిసార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ను ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు కప్ కూడా అందించాడు. 2008లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్‌.. 2009లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి టైటిల్ సాదించింది.

ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2012లో డెక్కన్‌ ఛార్జర్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్‌ కమిటీ రద్దు చేసింది. అనంతరం హైదరాబాద్‌ జట్టు హక్కులను సన్‌ టీవీ నెట్‌వర్క్‌ దక్కించుకుని.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా 2013లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో 2018లో ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ చేరింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది.

Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

తాజాగా పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. దాంతో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన మూడో ఆసీస్ ప్లేయర్‌గా కమిన్స్ నిలిచాడు. రూ.20.5 కోట్లను వెచ్చించి మరీ కమిన్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ చేరడంతో ఆ మొత్తానికి అతడు న్యాయం చేశాడని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.