Nitish Reddy Achieves Rrare IPL Milestone: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో హాఫ్ సెంచరీ, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ ఈ రికార్డు నెలకొల్పాడు.
పంజాబ్ కింగ్స్‌పై నితీశ్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మూడు ఓవర్లలో ఓ వికెట్ (జితేష్ శర్మ) పడగొట్టి.. 33 రన్స్ ఇచ్చాడు. ఇక భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ప్రభసిమ్రాన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ, వికెట్, క్యాచ్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. 20 ఏళ్ల 319 రోజుల వయసులో నితీశ్ ఫిఫ్టీ చేయగా.. ప్రియం గార్గ్ 19 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (4/29) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (46 నాటౌట్; 25 బంతుల్లో 6×4, 1×6), అశుతోష్ శర్మ (33 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. భువనేశ్వర్ కుమార్ (2/32), ప్యాట్ కమిన్స్ (1/22) కట్టడి చేశారు.