NTV Telugu Site icon

SRH vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..

Srh Vs Kkr

Srh Vs Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం కోసం ఇరుజట్లు వేచిచూస్తున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. అందుకనే.. ఇరుజట్లు విజయంపై కన్నేశాయి.

హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియస్కాంత్, నటరాజన్.

కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

Show comments