NTV Telugu Site icon

SHR vs RR: ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ అడ్డుకునేనా?

Srh Ipl 2024

Srh Ipl 2024

Sunrisers Hyderabad Playoff Chances: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా ఉంది. ఓ ప్లేస్ రాజస్థాన్‌ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది.

ఐపీఎల్ 2024లో రాజస్థాన్‌ రాయల్స్‌ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 నెగ్గి.. 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్త్ ఇప్పటికే దాదాపుగా ఖరారు అయింది. మిగిలిన 5 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కుతుంది. వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్‌.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. సన్‌రైజర్స్‌పై గెలిచి అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకోవాలని చూస్తోంది.

Also Read: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్

వరుసగా నాలుగు విజయాలు, రికార్డు స్కోర్లతో ఐపీఎల్‌ 2024లో జోష్‌ తీసుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. దాంతో సొంత గడ్డపై రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 5 గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ వెళ్లే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో మెరుగైన స్థితిలో నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అయితే వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.

Show comments