NTV Telugu Site icon

Yuzvendra Chahal-IPL: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి బౌలర్‌గా చహల్‌ అరుదైన రికార్డు!

Yuzvendra Chahal 200 Wickets

Yuzvendra Chahal 200 Wickets

Yuzvendra Chahal becomes first bowler to take 200 IPL wickets: రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం జైపూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ నబీని ఔట్‌ చేయడంతో చహల్‌ ఖాతాలో రెండొందల వికెట్ చేరింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన మణికట్టు స్పిన్నర్ చహల్‌.. 7.73 ఎకాన‌మీతో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చహ‌ల్ కొన‌సాగుతున్నాడు. చహల్‌ తర్వాతి స్ధానంలో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ఉన్నాడు. బ్రావో 183 వికెట్లు పడగొట్టాడు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన చహల్.. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి వికెట్స్ తీస్తున్నాడు. చహల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు.’

Also Read: MI vs RR: జైస్వాల్ సూపర్ సెంచరీ.. రాజస్థాన్ గెలుపు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ (65) టాప్‌ స్కోరర్‌. నెహాల్‌ వధేరా (49) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్తాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. యశస్వి జైస్వాల్‌ (104 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 7×6) మెరుపు సెంచరీ చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది.