IPL 2025 Final: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప టార్గెట్ ను బెంగళూరు కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ( 27 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 పరుగులు) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. విరాట్ కోహ్లీ (12), మయాంక్ అగర్వాల్ (19), రజత్ పటిదార్ (15నాటౌట్) రన్స్ చేశారు.
Read Also: Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!
కాగా, టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే వరుసగా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ బ్యాటింగ్ లో కోలుకోలేకపోయింది. పంజాబ్ బ్యాటింగ్ లో మార్కస్ స్టాయినిస్ (26) టాప్ స్కోరర్. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), ఒమర్జాయ్ (18) రన్స్ చేశారు. ప్రియాంశ్ ఆర్య (7), జోష్ ఇంగ్లిస్ (4), శ్రేయస్ అయ్యర్ (2), నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3) అట్టర్ ప్లాప్ కావడంతో ఇలా వచ్చి అలా పెవిలియన్ కు వెళ్లిపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్ సైతం సున్న పరుగులకే అవుట్ అయ్యాడు. కాగా, ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, హేజిల్‌వుడ్ తలో మూడు వికెట్లు తీసుకోగా, యశ్ దయాళ్ 2, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
