NTV Telugu Site icon

RCB vs LSG: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. లక్నో ముందు స్వల్ప లక్ష్యం

Rcb 20 Overs

Rcb 20 Overs

Royal Challengers Bangalore Scored 127 Runs Against LSG: ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేశారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ (31), డు ప్లెసిస్ (44) పుణ్యమా అని.. ఆర్సీబీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అసలే ఇది బౌలింగ్ పిచ్. అందుకు తగినట్టుగానే లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి.. ఆర్సీబీని 126 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్ గెలవాలంటే.. లక్నో జట్టుకి 127 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది అత్యల్ప లక్ష్యం కాబట్టి, దాన్ని ఛేధించడం లక్నోకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అఫ్‌కోర్స్.. ఇది బౌలింగ్ పిచ్ అయినా, లక్ష్యం మరీ తక్కువగానే ఉంది కాబట్టి, లక్నోకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఈ మ్యాచ్ తన సొంతం చేసుకోవాలంటే.. ఆర్సీబీ బౌలర్లు మ్యాజిక్ చేయాలి. లక్నో బ్యాటర్లను కట్టడి చేయగలగాలి. మరి.. ఆర్సీబీ బౌలర్లను అది సాధ్యం అవుతుందా?

Cholesterol Tips: వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. కొలెస్టిరాల్ మటుమాయం

Ipl Ad

నిజానికి.. ఇంతకుముందు లక్నో చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది కాబట్టి, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడుతారని అందరూ అనుకున్నారు. తొలి బంతికే కోహ్లీ ఫోర్ కొట్టడం చూసి.. తప్పకుండా కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించొచ్చని ఫ్యాన్స్ అంచనాలు వేసుకున్నారు. తీరా చూస్తే.. కోహ్లీ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఉసూరుమనిపించాడు. 30 బంతులు ఆడిన అతడు.. మూడు ఫోర్ల సహకారంతో కేవలం 31 పరుగులే చేశాడు. డు ప్లెసిస్ కూడా అతనిలాగే నిదానంగా ఆడాడు. ఎప్పుడూ భారీ షాట్లతో బౌండరీల వర్షం కురిపించే అతడు.. ఈ మ్యాచ్‌లో 39 బంతులకి 44 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇక వీళ్లిద్దరు ఔట్ అయ్యాక.. ఆర్సీబీ వికెట్ల పరంపర కొనసాగింది. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారే తప్ప.. ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. మ్యాక్స్‌వెల్ అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి, ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక కార్తిక్ 16 పరుగులు చేసి, రన్ తీసేందుకు వీలు లేని సమయంలో ఆవేశానికి పోయి, రనౌట్ అయ్యాడు. చివర్లో హసరంగ ఫోర్‌తో ముగించడంతో.. ఆర్సీబీ స్కోరు 126కి చేరింది.

Basil Seeds: తులసి గింజలతో శరీరానికి బోలెడు లాభాలు

ఇది బౌలింగ్ పిచ్ కావడంతో.. లక్నో బౌలర్లు తమ విశ్వరూపం చూపించారు. ఆర్సీబీ బ్యాటర్లకు భారీ షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. తక్కువ స్కోరుకే ఆర్సీబీని కట్టడి చేయడంలో విజయవంతం అయ్యారు. నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలా రెండు వికెట్లు, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ తీశారు. లక్నో బౌలర్లు తమ ప్రతాపం చూపించగలిగారు. మరి.. ఆర్సీబీ బౌలర్లు కూడా ఇలాగే తమ సత్తా చాటుతారా? అద్భుతమైన బౌలింగ్ వేసి, ఆ తక్కువ స్కోరుని డిఫెండ్ చేసి, తమ జట్టుని గెలిపించుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!