తులసి గింజలలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి గింజలను డైట్‌లో వినియోగించాల్సి ఉంటుంది. 

ఈ గింజల్లో కేలరీలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, కొలెస్ట్రాల్‌ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. 

రోగనిరోధక శక్తి పెంచడానికి తులసి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి గింజలను కషాయంలా చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

మలబద్ధకం, అసిడిటీ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి గింజలను గ్లాసు నీటిలో వేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల విత్తనాలపై ఆమ్లత్వం ఏర్పడి తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

తులసి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 

 తులసి గింజల్లో ఉండే ఔషధ గుణాలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. తరచుగా డిప్రెషన్ లేదా ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి గింజలను డికాషన్‌లా చేసుకుని తాగాల్సి ఉంటుంది.