NTV Telugu Site icon

Riyan Parag Youtube: హాట్ అందాల కోసం తెగ వెతికాడు.. ప‌రాగ్ అన్న పెద్ద ఆటగాడే!

Riyan Parag Youtube History

Riyan Parag Youtube History

Ananya Panday Hot in Youtube Search History of Riyan Parag: ఐపీఎల్ 2024లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్) ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో యువ ఆటగాడు రియాన్ ప‌రాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 17వ సీజ‌న్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 52 స‌గ‌టు, 149 స్ట్రైక్‌రేటుతో 573 ప‌రుగులు చేశాడు. దాంతో అత్య‌ధిక ప‌రుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. రియాన్ ఆటపై అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే ఐపీఎల్ 2024 ముగిసి ఒక్క రోజు కాకముందే అతడు విమర్శల పాలయ్యాడు. రియాన్ యూట్యూబ్ సెర్చ్ హిస్ట‌రీ అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌తో ఉండడమే ఇందుకు కారణం.

సోమవారం 22 ఏళ్ల రియాన్ పరాగ్ లైవ్ స్ట్రీమింగ్‌కు వచ్చాడు. ఈ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో అతడు యూట్యూబ్‌లో ఓ సాంగ్ కోసం సెర్చ్ చేశాడు. సెర్చ్ బాక్స్‌పై క్లిక్ చేయగానే.. సెర్చ్ హిస్టరీ కనిపించింది. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సారా అలీఖాన్, అనన్య పాండే పేర్లు క‌నిపించాయి. అయితే వారి పేర్ల పక్కనే హాట్ అని ఉండడమే ఇప్పుడు అతడు వార్తల్లో నిలవడానికి కారణమైంది. హీరోయిన్స్ హాట్ అందాల కోసం రియాన్ పరాగ్ సెర్చ్ చేశాడన్న మాట.

Also Read: BCCI-Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌ పోస్ట్.. అప్లై చేసిన మోడీ, అమిత్‌ షా!

యూట్యూబ్‌ సెర్చ్ హిస్ట‌రీని రియాన్ పరాగ్ హైడ్ చేయ‌కపోవ‌డంతో.. అత‌డి ప‌ర్స‌న‌ల్ హిస్ట‌రీ కాస్త‌ ప‌బ్లిక్‌ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘హీరోయిన్స్ హాట్ అందాల కోసం వెతికిన ప‌రాగ్’, ‘ప‌రాగ్ అన్న పెద్ద ఆటగాడే’, ‘హాట్ అందాల కోసం కుర్రోడు ఆరాటపడుతున్నాడే’ అంటూ నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రియాన్ వివాదాల్లో చిక్కుకోవ‌డం ఇదే మొద‌టిసారి మాత్రం కాదు. ఇంత‌క‌ముందు కూడా మైదానంలో వింత సెలెబ్రేషన్స్, సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లతో వివాదాల్లో చిక్కుకున్నాడు.

Show comments