NTV Telugu Site icon

Riyan Parag: అహంకారం ఏమీ లేదు.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!

Riyan Parag

Riyan Parag

Riyan Parag Says Iam going to play for Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రియాన్‌ పరాగ్‌ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా.. గొప్ప ప్రదర్శనేమీ లేదు. అడపాదడపా ఇన్నింగ్స్ మినహా.. వివాదాలతోనే వార్తల్లో నిలిచేవాడు. అయితే ఐపీఎల్ 2024లో అతడు నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ తరఫున రియాన్‌ పరాగ్‌ 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. 17వ సీజన్‌లో టాప్‌ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో త్వరలోనే తాను భారత జట్టుకు ఆడుతానని పరాగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ… ‘తప్పకుండా భారత జట్టుకు ఆడతానని ఐపీఎల్‌లో నేను పెద్దగా పరుగులు చేయనపుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పా. అది నాపై నాకున్న నమ్మకం. అలా అన్నానని నాకు అహంకారం ఏమీ లేదు. పదేళ్ల వయసులో క్రికెట్‌ మొదలుపెట్టినపుడే భారత జట్టుకు ఆడతానని అనుకున్నా. ఏదో ఒక దశలో సెలెక్టర్లు నన్ను భారత జట్టుకు ఎంపిక చేయక తప్పదు. అయితే ఎప్పుడన్నది నాకు తెలియదు. భారత జట్టుకు మాత్రం తప్పకుండా ఆడతా’ అని రియాన్‌ పరాగ్‌ చెప్పాడు.

Also Read: Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు

ఐపీఎల్ 2024లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. రాజ‌స్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో రియాన్ ప‌రాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఈ సీజ‌న్‌లో 52 స‌గ‌టు, 149 స్ట్రైక్‌రేటుతో 573 రన్స్ చేశాడు. దాంతో అత్య‌ధిక ప‌రుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ప‌రాగ్ నిలిచాడు.

Show comments