NTV Telugu Site icon

RCB vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

Rcb Vs Pk

Rcb Vs Pk

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. కాసేపట్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తన మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎలాాగైనా గెలువాలనే కసితో బరిలోకి దిగుతుంది. మరోవైపు.. పంజాబ్ తన తొలి మ్యాచ్ లో ఢిల్లీపై విజయం సాధించింది. ఇక.. ఆర్సీబీలో టాప్ ఆర్డర్ పవర్ ఫుల్ గా ఉంది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అంజు రావత్, కర్ణ్ శర్మ, జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కెప్టెన్ శిఖర్ ధావన్ కి ఐపీఎల్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. వీరి ఆటంతా పవర్ ప్లే మీదే ఆధారపడి ఉంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో ఇరగదీస్తే, మామూలుగా ఉండదు.

ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్:
డుప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, పటీదార్, మ్యాక్స్ వెల్, గ్రీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, జోసెఫ్, దయాల్, దగర్, సిరాజ్.

పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్:
శిఖర్ ధావన్ (కెప్టెన్), బెయిర్ స్టో, జితేష్ శర్మ, లివింగ్ స్టోన్, కరన్, శశాంక్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్, బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్.

Show comments