Site icon NTV Telugu

RCB vs GT: ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!

Will Jacks

Will Jacks

Will Jacks Took 10 Balls only To Hit 50 to 100 in IPL: ఐపీఎల్‌ 2024లో విదేశీ యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆది అందరిని ఆకర్షించాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఫ్రేజర్.. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌ అన్నట్లు అతడి ఇన్నింగ్స్‌ సాగింది. తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ రెచ్చిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న జాక్స్‌.. గుజరాత్ టైటాన్స్‌పై విధ్వంసక శతకంతో ఆకట్టుకున్నాడు.

నిజానికి ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ తొలుత 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. కాస్త స్పీడ్ పెంచిన అతడు అర్ధ శతకాన్ని 31 బంతుల్లో పూర్తి చేశాడు. ఆపై జాక్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంటే 10 బంతుల్లో 50 నుంచి 100 స్కోరుకు చేరుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి 13 బంతులు తీసుకున్నాడు.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

ఐపీఎల్‌లో వేగవంతమై సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో విల్ జాక్స్ అయిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ (37), డేవిడ్ మిల్లర్ (38), ట్రావిస్ హెడ్ (39), జాక్స్ (41) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హెడ్, జాక్స్ ఐపీఎల్ 2024లో శతకాలు చేశారు.

Exit mobile version