Site icon NTV Telugu

Ashwin Retirement: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!

Ashwin

Ashwin

Ravichandran Ashwin Retirement: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‎కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ఈరోజు (ఆగస్ట్ 27) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన అశ్విన్.. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.. గత సీజన్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగిన ఈ స్టార్ స్పిన్నర్.. గత సీజన్‎లో అంచనాల మేర రాణించలేకపోవడంతో సీఎస్కే వచ్చే సీజన్‎కు ఆర్. అశ్విన్‎ను వేలానికి వదిలి పెట్టడంతో గత కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్‎కు వీడ్కోలు చెప్పడం గమనార్హం.

Read Also: Ganesh Chaturthi 2025: గణేష్ పండుగ భారత్ లోనే కాదు.. ఈ దేశాల్లో కూడా జరుపుకుంటారు తెలుసా?

ఐపీఎల్ ప్లేయర్‎గా నా టైమ్ నేటితో ముగిసింది.. కానీ వివిధ లీగ్‌ల్లో ఆటగాడిగా నా సమయం ఈరోజుతో ప్రారంభమైందని అశ్విన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్, బీసీసీఐకి నా ధన్యవాదాలు.. భవిష్యత్‎ను మరింత ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రిటైర్మెంట్ ప్రకటనలో అశ్విన్ వెల్లడించారు.

Read Also: Delhi: గాజాలో జర్నలిస్టుల హత్యను ఖండించిన భారత్.. మృతులకు విదేశాంగ శాఖ సంతాపం

అయితే, రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‎లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీసుకున్నాడు. లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడాడు. అలాగే, పంజాబ్‎కు కెప్టెన్‎గా కూడా కొనసాగాడు. అలాగే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్, పియూష్ చావ్లాలు అశ్విన్ కంటే ముందు వరుసలో ఉన్నారు.

Exit mobile version