Death threats to Ambati Rayudu’s family From Virat Kohli Fans: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ తెలిపారు. కొందరైతే రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారని అయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సామ్ పాల్ కోరారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగు తేజం రాయుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అంబటి రాయుడు పదే పదే విమర్శలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్‌ను గెలిపించలేదని కోహ్లీపై రాయుడు సెటైర్ వేశాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే.. టైటిల్ గెలిచినంతగా బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని మరోసారి విమర్శించాడు. కోహ్లీ, బెంగళూరు జట్టుని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో.. రాయుడిపై ఆర్‌సీబీ ఫాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. కొందరు రాయుడిని బండ బూతులు తిట్టారు. రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ బెదిరింపులపై రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
‘ఈ రోజు నేను, నా స్నేహితుడు అంబటి రాయుడు కుటుంబ సభ్యులం డిన్నర్ కోసం బయటకు వెళ్ళాం. రాయుడు ఐపీఎల్ 2024 కోసం స్టార్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగా చేశాడు. ఇటీవల ఓ జట్టు గురించి మాట్లాడుతూ కప్ ఎందుకు కొట్టలేదో తేడా వివరించాడు. రాయుడి చేసిన కామెంట్స్‌ను విరాట్ కోహ్లీ ఫాన్స్, క్రిమినల్స్, పీఆర్ ఏజెన్సీలు వ్యక్తిగతంగా తీసుకొని.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేను, రాయుడు వీటిని చూసి నవ్వుకున్నాం. ఏడాది, నాలుగేళ్ల వయసున్న కూతుళ్లను హత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని రాయుడి సతీమణి విద్య నాతో తెలిపింది. దారుణమైన ట్రోలింగ్‌తో వారిని తీవ్రంగా హింసిస్తున్నారు. మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని సామ్ పాల్ పేర్కొన్నారు.