Site icon NTV Telugu

RR vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

Pbks Vs Rr

Pbks Vs Rr

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా.. కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక.. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ లు ఆడి.. కేవలం రెండు మ్యాచ్ లు గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ జట్టు 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌ లు ఆడి కేవలం ఒకదానిలో మాత్రమే ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.

పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్:
సామ్ కుర్రాన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, అథర్వ తైదే, ప్రభ్ సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్.

రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
షిమ్రాన్ హెట్మెయర్, తనుష్ కోటియన్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్మాన్ పావెల్, ట్రెంట్ బౌల్ట్, కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.

Exit mobile version