NTV Telugu Site icon

MI vs RR: 5 వికెట్లతో చెలరేగిన సందీప్ శర్మ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

Mi

Mi

ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 179 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై బ్యాటింగ్ లో ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్ ను తిలక్ వర్మ (65) దూకుడు బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. అతనితో పాటు నేహాల్ వధేరా (49) పరుగులు చేయడంతో.. ముంబై 179 పరుగులు చేసింది.

Read Also: Anant-Radhika wedding: అనంత్-రాధిక పెళ్లి కబురు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!

ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ (6), ఇషాన్ కిషన్ డకౌట్ తో నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (10) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత తిలక్ వర్మ (65), నబీ (23), నేహాల్ వధేరా (49), హార్ధిక్ పాండ్యా (10), టిమ్ డేవిడ్ (3) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. అతని 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ 2.. చాహల్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లొ ఒక వికెట్ తీసిన చాహల్.. ఐపీఎల్‌లో మొత్తం 200 వికెట్లు పడగొట్టి రికార్డు సాధించాడు. మరోవైపు బోల్ట్ తన టీ-20 కెరీర్‌లో 250 వికెట్లు తీశాడు.

Read Also: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..

Show comments