Rajasthan Royals Scored 107 In First 10 Overs Against SRH: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రప్ఫాడిస్తోంది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లపై తాండవం చేస్తోంది. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆర్ఆర్.. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసింది. రాజస్థాన్ తరఫున ఓపెనింగ్ చేసిన యశస్వీ జైస్వాల్, జాస్ బట్లర్.. తమ జట్టుకి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా.. జైస్వాల్ చెలరేగి ఆడాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే అతడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు బట్లర్ తనకు మద్దతు ఇస్తుండగా, మరోవైపు జైస్వాల్ విజృంభించాడు.
Sunil Joshi: సంజూ కంటే బాగా ఆడుతున్నాడు.. అతడ్ని టీమిండియాకి ఎంపిక చేయాలి
అయితే.. ఆ దూకుడులోనే జైస్వాల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన సంజూ.. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఇక కుదురుకున్నాక తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టాడు. సిక్సులు, ఫోర్లతో తాండవం చేశాడు. అతడ్ని చూసి.. బట్లర్ కూడా ఖాతా తెరవడం మొదలుపెట్టాడు. నువ్వేనా, నేనూ కొడతా అన్నట్టు.. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడటం స్టార్ట్ చేశాడు. ఇలా వీళ్లు పోటీపడి ఆడుతుండటంతో.. రాజస్థాన్ స్కోరు పరుగులు పెడుతోంది. తొలి 10 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని దాటేశారంతే.. ఎలా దుమ్మురేపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి.. మిగిలిన 10 ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లు ఎంతమేర స్కోరు చేస్తారో? హైదరాబాద్‌కి ఎంత లక్ష్యం ఇస్తారో చూడాలి.
Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
