NTV Telugu Site icon

CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న పంజాబ్.. 10 ఓవర్లకు స్కోర్ ఇదే..

Punjab

Punjab

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్య ఛేదన కోసం రంగంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారిస్తున్నారు. 10 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన 94 పరుగులు చేసింది.

Also Read : Komatireddy Venkat Reddy : అంబేద్కర్‌ ఆశయాలు కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా

పంజాబ్ కింగ్స్ జట్టు పవర్ ప్లేలో 50 పరుగుల మార్క్ ను దాటింది. అయితే ఐదు ఓవర్లలోనే పంజాబ్ జట్టు హాఫ్ సెంచరీ చేయడంతో పాటు 4.2 ఓవర్లలోనే తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ సీఎస్కే ఫీల్డర్ పతిరణకు క్యాచ్ ఇచ్చిన ఔట్ అయ్యాడు. దీంతో 50 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ ను కోల్పోయింది.

Also Read : Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. 40 మంది ప్రయాణికులకు గాయాలు

ఇక పంజాబ్ టీమ్ ఆరు ఓవర్లు ముగిసే సరికి 62 పరుగుల చేసింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. దీంతో పటిష్టమైన బ్యాటింగ్ తో దూసుకుపోతున్న శిఖర్ ధావన్ సేనకు మరో ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ ఔట్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 81 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ ( 28 ), ప్రభుసిమ్రాన్ సింగ్ ( 42 )లు అవుట్ కావడంతో పంజాబ్ శిబిరంలో ఆనందం ఆవిరైపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ఓవర్లలో వికెట్లు తీస్తుండటంతో పంజాబ్ కింగ్స్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. స్కోర్ బోర్డు నెమ్మదిగా పరుగులు పెడుతుంది.