Preity Zinta-IPL 2024: ప్రీతి జింటా చేసిన పొరపాటు.. పంజాబ్ కింగ్స్‌కు వరంలా మారింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashank Singh is a Star for PBKS in IPL 2024: డిసెంబర్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ సింగ్ తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాడని కవర్ చేసింది.
వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. 19 ఓవర్లకు పంజాబ్ 6 వికెట్స్ కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అయితే 20వ ఓవర్‌లో శశాంక్ సింగ్ చెలరేగాడు. ఆర్‌సీబీ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. దాంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. శశాంక్ హిట్టింగ్‌తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Virat Kohli: ఇప్పటికీ నా పేరే.. జట్టులో స్థానం దక్కుతుంది: కోహ్లీ
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయం ఖాతాలో వేసుకుంది. ఆర్‌సీబీతో చివరివరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్ (3.2 ఓవర్లలో 40), హర్షల్ పటేల్ (1/45) ధారాళంగా పరుగులిచ్చారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!