NTV Telugu Site icon

MS Dhoni GoldenDuck: ఎంఎస్ ధోని గోల్డెన్ డక్‌.. ప్రీతి జింటా సంబరాలు..!

Prethi Zinta

Prethi Zinta

MS Dhoni: ఐపీఎల్-2024లో భీకర ఫాంలో ఉన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఆఖర్లో రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగుకు దిగడంతోనే క్లీన్ హిట్టింగ్ ​తో అదరగొడుతున్నాడు. వచ్చిన బాలును వచ్చినట్లు బౌండరీ లైన్ కి బౌండరీ దాటిస్తున్నాడు. భారీ సిక్సులు బాదుతూ వింటేజ్ ధోనీని గుర్తు చేస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఇలాగే విధ్వంసం సృష్టిస్తాడని ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, హర్షల్ పటేల్ వేసిన స్లోవర్ ఫుల్ లెంగ్త్ డెలివరీకి స్లాగ్ షాట్ కొట్టేందుకు ట్రై చేసిన ధోని గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక, మాహీ వికెట్ తీసినా హర్షల్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు.. రెండు చేతులు అలా పైకి ఉంచి సైలెంట్ అయిపోయాడు.

Read Also: CM YS Jagan: సీఎం జగన్‌ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం

అయితే, హర్షల్ పటేల్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టడంతో స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే సీటులోంచి పైకి లేచి సంబరాలు చేసుకోవడం కనిపించింది. కాగా, పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. చెన్నై ఇచ్చిన 168 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభసిమ్రాన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.. నిర్ణత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్, శార్దూర్ ఠాకూర్‌కు తలో వికెట్ తీసుకున్నారు.