Site icon NTV Telugu

PM Modi : వాడు బుడ్డోడు కాదు బుల్డోజర్… ప్రధాని ప్రశంసలు!

Pmmodi Vaibhav

Pmmodi Vaibhav

ఒక్క సెంచరీతో ప్రధాని మోడీనే ఆకర్షించాడు టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ ఐపీఎల్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. మూడో మ్యాచ్ లో గుజరాత్ పై 35 బంతుల్లోనే భారీ శతకంతో చెలరేగాడు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ క్రికెటర్ గా మారాడు. ఏకంగా దేశ ప్రధాని మోడీని ఆకర్షించాడు. తాజాగా ప్రధాని మోడీ వైభవ్ బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ చాలానే సాధించాడన్నారు. వైభవ్‌ ఈ స్థాయికి ఎదగానికి ఎంతో కష్టపడ్డాడని పీఎం కొనియాడారు.

Also Read : RCB Fan : ఆర్సీబీ గెలవకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా..!

అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రి వైభవ్ ని కలిసి పది లక్షల చెక్ అందించిన విషయం తెలిసిందే. తన రాష్ట్రానికి చెందిన కుర్రాడు సాధించిన ఘనతను తమ రాష్ట్ర సక్సెస్ గా భావించారు సీఎం నితీష్ కుమార్. వైభవ్ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ తొలిసారిగా జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నది. మే 4 నుంచి 15 వరకు అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ప్రధాన నగరాలు పాట్నా, రాజ్‌గిర్, గయ, భగల్‌పూర్, బెగుసరాయ్‌లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరోవైపు షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. తాజాగా ప్రధాని మోడీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను వర్చువల్ గా ప్రారంభించారు.

Also Read : Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ

Exit mobile version