Site icon NTV Telugu

PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Interview

Hardik Pandya Interview

Hardik Pandya on Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అషుతోష్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని బాది తమని భయపెట్టాడన్నాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందరూ ఉత్కంఠకు గురయ్యారని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్‌ సంచలన విజయం సాధించేలా కనిపించినా.. ఆఖర్లో పుంజుకున్న ముంబై అనూహ్య విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘ఇది అద్భుత మ్యాచ్. ప్రతిఒక్కరు ఉత్కంఠకు గురయ్యారు. ఈ మ్యాచ్ ప్రతీ ఒక్కరి సత్తాకు పరీక్షగా నిలుస్తుందని మ్యాచ్‌కు ముందే చెప్పా. సహజంగా మ్యాచ్‌లో మనమే ముందున్నామని అనుకుంటాం. కానీ టీ20ల్లో మ్యాచ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విజయం సాధించే వరకు నమ్మకంగా ఉండలేం. అందుకే అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నాడు.

Also Read: Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్‌ శర్మ

‘అషుతోష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ పరిస్థితుల్లో వచ్చి ప్రతీ బంతిని బాదాడు. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అషుతోష్ ఆట పట్ల సంతోషంగా ఉంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. టైమ్ ఔట్‌లో మేం ఒకటే విషయం మాట్లాడుకున్నాం. చివరి వరకు అప్రమత్తంగా ఉండాలనుకున్నాం. కొన్ని ఓవర్లలో భారీగానే పరుగులిచ్చాం. ఏది ఏమైనప్పటికీ విజయం సాధించడం ఆనందంగా ఉంది. వచ్చే మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేస్తాం’ అని హార్దిక్ పాండ్యా చెప్పాడు.

 

Exit mobile version