Site icon NTV Telugu

KKR vs MI: 16 ఓవర్ల మ్యాచ్.. భారీ స్కోరు చేసిన కోల్కతా

Mi

Mi

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్కతా బ్యాటింగ్లో అత్యధికంగా వెంకటేశ్ అయ్యర్ (42) పరుగులతో రాణించాడు. మొదట్లో 3 వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పటికీ, నితీశ్ రాణా (33) మంచి భాగస్వామంతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్ (24) పరుగులతో జట్టు స్కోరును పెంచాడు.

Read Also: Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి

ఆ తర్వాత.. చివర్లో రింకూసింగ్ (20) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్కతా బ్యాటింగ్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6), సునీల్ నరైన్ డకౌట్తో నిరాశపరిచారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7) రాణించలేకపోయాడు. రమణ్ దీప్ సింగ్ (17), స్టార్క్ (2) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్లో పీయూష్ చావ్లా, బుమ్రా తలో 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత.. నువాన్ తుషార, అన్శుల్ కాంబోజ్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: Snakes on a plane: వీడెవడండీ బాబు.. ఏకంగా అనకొండలను రవాణా చేస్తున్నాడు..

Exit mobile version