Site icon NTV Telugu

CSK vs MI: చెన్నై భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

Csk

Csk

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల చేసింది. చెన్నై బ్యాటింగ్ లో చివరలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), శివం దూబే (66*) పరుగులతో దుమ్ము దులిపారు.

Read Also: Viral Video: స్కూల్ ఆవరణలో రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. చివరకు..?!

గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. దూబే ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సీఎస్కే భారీ స్కోరు చేసింది. సీఎస్కే బ్యాటింగ్ లో రహానే (5), రచిన్ రవీంద్ర (21), డారిల్ మిచెల్ (17) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. కోయెట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Read Also: MP Ranjith Reddy : అంబేద్కర్ చూపిన బాట‌.. రంజిత్ ఆచ‌రించి చూపుతున్న వేళ‌…

Exit mobile version