Mumbai Indians Won The Toss And Chose To Field Against Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 54వ మ్యాచ్. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆర్సీబీ, ముంబై జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన ఈ ఇరుజట్లు.. ఐదు విజయాలు నమోదు చేశాయి. అయితే.. రన్ రేట్ బాగుండటంతో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ ఇరు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు పొందాలంటే.. ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఈ లెక్కన.. ఆర్సీబీ, ముంబై జట్లకు ఇది తాడోపేడో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ టీమ్ గెలిచినా.. టాప్-3 స్థానాన్ని కైవసం చేసుకుంటాయి.
Nandini Reddy: ‘అన్నీ మంచి శకునములే’ అంటున్న ‘తొలిప్రేమ’ వాసుకి!
ఆల్రెడీ ఈ రెండు జట్లు ఏప్రిల్ 2వ తేదీన తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 172 పరుగుల్ని ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (82), డు ప్లెసిస్ (73) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి.. తమ జట్టుని గెలిపించుకున్నారు. అందుకు ముంబై ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుందా? ముంబై జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఎందుకో ఈ జట్టు తడబడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఈ సీజన్‌లో ఇప్పటిదాకా తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క అర్థశతకం మినహాయిస్తే.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సూర్య, ఇషాన్ ఈమధ్య ఫామ్‌లోకి తిరిగొచ్చారు. గ్రీన్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ అప్పుడప్పుడు చెలరేగి ఆడుతున్నాడు. బౌలింగ్ విభాగం మాత్రం ముంబైది చాలా బలహీనమైనది. ఆర్సీబీలో కోహ్లీ, డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆడితేనే.. ఆ జట్టు స్కోరు పరుగులు తీస్తోంది. మిడిలార్డర్ చాలా దారుణంగా ఉంది. బౌలింగ్ విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీగా రాణిస్తోంది. అలాంటి ఈ రెండు జట్లలో.. ఈరోజు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Largest Theatres: భారతదేశంలోని టాప్-10 అతిపెద్ద సినిమా థియేటర్‌లు
