Mumbai Indians Won The Match By 6 Wickets Against RCB: మే 9వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు 16.3 ఓవర్లలోనే ఛేధించింది. సూర్యకుమార్ (35 బంతుల్లో 83) ఊచకోత కోయడం.. నేహాల్ (34 బంతుల్లో 52) అర్థశతకంతో రాణించడం.. ఇసాన్ కిషన్ (21 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ముంబై సునాయాసంగా ఆ భారీ లక్ష్యాన్ని ఛేధించగలిగింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. 200 పరుగుల్ని డిఫెండ్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. ఎవ్వరూ ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Talasani Srinivas Yadav: నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. మంత్రి తలసాని
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 68), డు ప్లెసిస్ (41 బంతుల్లో 65) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడటం.. చివర్లో దినేశ్ కార్తిక్ (18 బంతుల్లో 30) రాణించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే అతడు పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, విజయఢంకా మోగించింది. మొదట ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ.. తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. ముఖ్యంగా.. ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కి వీరి భాగస్వామ్యం 51 పరుగులుంటే.. అందులో ఇషాన్ చేసినవే 42 పరుగులున్నాయి. రోహిత్ శర్మ కేవలం అతనికి స్ట్రైక్ ఇస్తూ, మద్దతిచ్చాడంతే. ఇషాన్ ఔటైన కాసేపటికే.. రోహిత్ శర్మ (7) ఔట్ అయ్యాడు.
Malaika Arora: ఆకులో ఆకువై.. పువ్వులో పువ్వువై.. అందాలను ఒలికిస్తుందిలా
అప్పుడు క్రీజులోకి వచ్చిన నేహాల్, సూర్య.. తొలుత కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇక క్రీజులో కుదురుకున్నాక తమ విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా.. సూర్యకుమార్ యాదవ్ అయితే తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో బౌండరీల మోత మోగించేశాడు. ఎలాంటి బంతులేసినా.. వాటిని అనుకూలంగా మార్చుకొని పరుగుల సునామీ సృష్టించాడు. 35 బంతుల్లోనే అతడు 83 పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్‌లో విజృంభించాడో మీరే అర్థం చేసుకోండి. మరోవైపు.. నేహాల్ సైతం తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా రెచ్చిపోయాడు. చివర్లో ఇతడు సిక్స్ కొట్టి.. జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లడంతో పాటు తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ విజయంతో.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ బౌలర్లో హసరంగ, వైశాక్ చెరో రెండు వికెట్లు తీశారు.
