Site icon NTV Telugu

SRH vs MI: చితక్కొట్టిన ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

Mi 20 Overs Scored

Mi 20 Overs Scored

Mumbai Indians Scored 192 In 20 Overs Against SRH: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెమరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64) అర్థశతకంతో చెలరేగడంతో పాటు తిలక్ వర్మ (17 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. ముంబై ఇంత భారీ స్కోరు చేయగలిగింది. మొదట్లో రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్‌ (38) సైతం శుభారంభమే అందించారు.

Rafale: భారత వెలుపల రాఫెల్ విన్యాసాలు.. తొలిసారి ఎగిరిన యుద్ధ విమానం

తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. ముంబై బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. తొలుత నిదానంగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత మెల్లగా జోరు పెంచారు. ముఖ్యంగా.. రోహిత్ శర్మ సాధ్యమైనంతవరకూ పరుగుల వర్షం కురిపించేందుకు ప్రయత్నించాడు. ప్రతీ బంతిని బౌండరీగా మలిచేందుకు ట్రై చేశాడు. కానీ.. ఆ జోరులోనే అతడు అనుకోకుండా ఔట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్‌లో ఒక బంతిని లెగ్ సైడ్ కొట్టబోగా.. అది బ్యాట్ అంచున తగిలి గాల్లోకి ఎగిరింది. దీంతో.. ఆ బంతి నేరుగా మార్ర్కమ్ చేతుల్లోకి వెళ్లడంతో.. రోహిత్ క్యాచ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది.

Mahamood Ali: ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి

అనంతరం క్రీజులోకి వచ్చిన కెమరాన్ గ్రీన్.. కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ కూడా ఆచితూచి ఆడుతూ, అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదేందుకు ట్రై చేశాడు. కానీ.. 87 పరుగుల వద్ద షాట్ కొట్టబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పుడు తిలక్ వర్మ రాగా.. ముంబై స్కోరు పరుగులు పెట్టడం మొదలైంది. వచ్చి రాగానే అతడు షాట్లు కొట్టడం ప్రారంభించాడు. దీంతో.. 17 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు సహకారంతో 37 పరుగులు చేశాడు. ఇతడు ఔటయ్యాక గ్రీన్ ఊపందుకున్నాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన అతగాడు.. ఎడాపెడా షాట్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.

Vyshak Vijay Kumar: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. వైషాక్ చెత్త రికార్డ్

ఓవైపు టిమ్ డేవిడ్ చేయూతనివ్వగా.. మరోవైపు గ్రీన్ ఒకటే బాదుడు బాదేశాడు. డేవిడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు అతడు 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. చివరివరకూ గ్రీన్ అజేయంగా నిలిచాడు. చివరి బంతికి రెండు పరుగులు తీస్తున్న క్రమంలో.. డేవిడ్ రనౌట్ అయ్యాడు. తద్వారా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్ల విషయానికొస్తే.. మార్కో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే.. మార్కో, నటరాజన్ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు.

Exit mobile version