NTV Telugu Site icon

Mohit Sharma Record: సన్‌రైజర్స్‌ బౌలర్‌ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో మోహిత్‌ శర్మ చెత్త రికార్డు!

Mohit Sharma

Mohit Sharma

Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్‌ తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. దాంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ బౌలర్‌ బాసిల్‌ థంపి రికార్డు బద్దలైంది. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో థంపి 4 ఓవర్లలో వికెట్‌ తీయకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు.

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ ముందు వరకు మోహిత్‌ శర్మ పర్వాలేదనిపించాడు. ఢిల్లీ మ్యాచ్‌లోనే అతడు తడబడ్డాడు. తన మొదటి ఓవర్లో (ఢిల్లీ ఇన్నింగ్స్ 12వ ఓవర్) రిషబ్ పంత్ రెండు ఫోర్లు బాది 12 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో (16వ ఓవర్) పంత్ రెండు సిక్సులు బాదడంతో 16 రన్స్ ఇచ్చాడు. తన మూడో ఓవర్లో 14 రన్స్ ఇచ్చిన మోహిత్‌.. నాలుగో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పంత్‌ దాటికి వరుసగా 2, Wd, 6, 4, 6, 6, 6 పరుగులు ఇచ్చాడు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 224 రన్స్ చేసినా.. కేవలం 4 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 220 రన్స్ చేసింది. మోహిత్‌ శర్మ అన్ని రన్స్ ఇవ్వకుంటే గుజరాత్‌ సునాయాసంగా గెలిచేదే. భారీగా పరుగులు ఇచ్చిన మోహిత్‌ పేరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్స్ తీసిన మోహిత్‌.. ఓవర్‌కు 10.35 చొప్పున రన్స్ ఇచ్చాడు.