NTV Telugu Site icon

MS Dhoni-IPL 2024: తొలి భారత క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!

Ms Dhoni Record

Ms Dhoni Record

MS Dhoni IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లోని 3, 4, 5 బంతులను ధోనీ సిక్సర్లుగా మలిచాడు.

Also Read: MS Dhoni Sixes: మా యువ వికెట్ కీపర్‌ సిక్స్‌లే చెన్నై విజయానికి కారణం: రుతురాజ్‌

ఐపీఎల్‌లో సునీల్‌ నరైన్‌, నికోలస్‌ పూరన్‌లు తాము ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచారు. వీరిద్దరూ విదేశీ ప్లేయర్స్ కాగా.. ఎంఎస్ ధోనీ స్వదేశీ ఆటగాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన 19వ ఓవర్ రెండో బంతికి డారిల్ మిచెల్ ఔట్ కాగా.. ధోనీ క్రీజులోకి వచ్చాడు. 3, 4, 5 బంతులను మహీ సిక్సర్లుగా మలిచాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. దాంతో ఈ ఓవర్‌లో చెన్నై ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ధోనీ చివరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే.. ముంబై, చెన్నై స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం.