Lucknow Super Giants Scored 257 In 20 Overs Against Punjab Kings: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. కైల్ మేయర్స్ (24 బంతుల్లో 54), బదోని (24 బంతుల్లో 43), స్టోయినిస్ (40 బంతుల్లో 72), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. లక్నో జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద స్కోరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 263/5 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉండగా.. లక్నో 257/5 స్కోర్‌తో సెకండ్ హయ్యస్ట్ టోటల్‌ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. పంజాబ్ జట్టుకి 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది.
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచం మొత్తం వెతికినా దొరకడు
తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. లక్నో జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. తొలి ఓవర్‌లో లక్నో కేవలం రెండంటే రెండు పరుగులు మాత్రమే చేసింది. కానీ.. రెండో ఓవర్ నుంచి లక్నో విజృంభణ మొదలైంది. వచ్చి రావడంతోనే కైల్ మేయర్స్ చెలరేగిపోవడంతో.. లక్నో స్కోరు పరుగులు పెట్టడం స్టార్ట్ చేసింది. కేఎల్ రాహుల్ కూడా ఒక సిక్స్, మరో ఫోర్ కొట్టడంతో.. అతడు కూడా విధ్వంసం సృష్టిస్తాడని అనుకున్నారు. కానీ.. అతడు 12 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. కైల్ మేయర్స్ తన దూకుడు మాత్రం ఆపలేదు. అతడు దుమ్ముదులుపుతూనే ఉన్నాడు. అతడ్ని చూసి బదోని కూడా రెచ్చిపోయాడు. కైల్ మేయర్స్ పోయాక వచ్చిన స్టోయినిస్ సైతం.. పంజాబ్ బౌలర్లపై తాండవం షురూ చేశాడు. బదోని ఔటయ్యాక వచ్చిన పూరన్ అయితే.. పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. చివర్లో వచ్చిన దీపక్ హుడా రెండో ఫోర్లతోనూ, కృనాల్ పాండ్యా ఒక ఫోర్‌తో రాణించడంతో.. లక్నో స్కోరు 257/5 కి చేరింది.
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి పాడు పని.. పోలీసులకు నోటీసులు
పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. కగిసో రబాడ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టన్ తలా వికెట్ పడగొట్టారు. ఒక్క రాహుల్ చాహర్ (4 ఓవర్లలో 29 పరుగులు) మాత్రమే పొదుపుగా బౌలింగ్ వేయగా.. మిగతా వాళ్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్, రబాడ వంటి మెరుగైన బౌలర్లు సైతం భారీగా రన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు అసలు ప్రశ్నేమిటంటే.. 258 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఛేధించగలుగుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!