Lucknow Super Giants Need To Score 183 To Win The Match Against SRH: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఎవ్వరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. ఆడిన ఐదుగురు బ్యాటర్లు బాగానే రాణించారు. క్లాసెన్ 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలవగా.. అబ్దుల్ సమద్ (37), అన్మోల్ ప్రీత్ (36), మార్ర్కమ్ (28), రాహుల్ త్రిపాఠి (20) ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడారు. తద్వారా.. ఎస్ఆర్‌హెచ్ అంత స్కోరు చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Sesame Oil: నువ్వుల నూనెతో ఈ ప్రయోజనాలు తెలుసా..?
మొదట్లో వికెట్లు పడుతున్నా.. ఎస్ఆర్‌హెచ్ స్కోరు మాత్రం బాగానే పరుగులు పెట్టింది. 115 స్కోర్ వరకు ఎస్ఆర్‌హెచ్ జోరు బాగానే కొనసాగించింది. కానీ.. 115 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు పడటంతో, సన్‌రైజర్స్ దూకుడు తగ్గింది. క్రీజులో ఉన్న క్లాసెన్, అబ్దుల్ సమద్.. మరో వికెట్ పడకుండా ఉండేందుకు ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. భారీ షాట్ల జోలికి వెళ్లలేదు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి ఇద్దరూ చెలరేగిపోయారు. ఓవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు అనుకూలమైన బంతులు దొరికినప్పుడు బౌండరీల మోత మోగించేశారు. ఈ క్రమంలో ఒక నో-బాల్ విషయమై కొంత వివాదం చెలరేగింది. హైట్ పరంగా నో-బాల్ అయినప్పటికీ.. థర్ట్ అంపైర్ దాన్ని నో-బాల్ కాదని నిర్ధారించడంతో, మైదానంలో ఉన్న అభిమానులు మండిపడ్డారు. గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. దీంతో.. ఐదు నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. క్లాసెన్ సైతం నో-బాల్ ఇవ్వకపోవడంతో నిరాశ వ్యక్తం చేశాడు.
DK Shiva Kumar : డీకే శివకుమార్ ఒక్కరోజు ప్రచారానికే.. లక్ష ఓట్ల మెజారిటీ
ఆ పరిస్థితుల్ని అంపైర్లు చక్కదిద్దిన తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అప్పటికే నిరాశలో ఉన్న క్లాసెన్.. ఒక ఫోర్ కొట్టి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్‌లోనూ పెద్దగా మెరుపులు మెరవలేదు. యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తొలి మూడు బంతుల్ని డాట్స్‌గా మలిచాడు. అనంతరం అబ్దుల్ సమద్ ఒక సిక్స్ కొట్టాడు. చివరి బంతికి రెండు పరుగులతో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. లక్నో బౌలర్ల విషయానికొస్తే.. కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. యుధ్వీర్ సింగ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలా వికెట్ తీశారు.