చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది.
బోలెడు ఔషధగుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనెల రూపంలో భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
మీ డైట్‌లో నువ్వుల నూనెను యాడ్ చేసుకుంటే.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలేవో చూద్దాం.
ఒక టీస్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటే.. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములుంటాయి.
నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే.. ఆ నూనె చర్మం కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి, చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది.
ఈ నూనెలో ఉండే విటమిన్ ఈ.. యూవీ కిరణాలు, కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో నువ్వుల నూనె ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది.
నువ్వుల నూనె శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది. ఇందులోని ఫైబర్ ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకంను తొలగిస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా.. నువ్వుల నూనె కీళ్ల వాపు, పంటినొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
నిద్రలేమితో బాధపడేవారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై ఈ నూనెను 5 నిమిషాలు మసాజ్ చేస్తే.. బాగా నిద్ర పడుతుంది.