ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయనుంది. కాగా.. ఇప్పటివరకు లక్నో ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోగా.. ఈ మ్యాచ్ లో గెలువాలనే కసితో బరిలోకి దిగుతుంది. మరోవైపు.. పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో.. ఒక మ్యాచ్ లో గెలిచి, మరో మ్యాచ్ లో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు తరుఫున నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Skin Care: వేసవిలో మీ చర్మం యవ్వనంగా ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్:
డీకాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, పడిక్కల్, బదోనీ, నికోలస్ పూరన్ (కెప్టెన్), స్టోయినీస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.
పంజాబ్ కింగ్స్ ప్లేయింట్ ఎలెవన్:
శిఖర్ ధావన్ (కెప్టెన్), బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, కరన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్ష్ దీప్ సింగ్.
